Mon Dec 23 2024 16:26:46 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిల రెండో పెళ్లి గురించి కామెంట్లు చేస్తున్న జనసేన నాయకులు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా టీవీల ముందుకొచ్చి మరీ మూడు పెళ్లిళ్లు చేసుకోమని చెబుతున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన భాషలో తిడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాళ్లా మన నాయకులని విరక్తి కలుగుతున్నట్లు జగన్ చెప్పారు. వీధి రౌడీలు కూడా ఇలాంటి భాష మాట్లాడరని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కొక్కరూ మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే మన అక్కాచెల్లెళ్లు, మన ఆడపడుచులు ఏమైపోతారని జగన్ ప్రశ్నించారు. పెళ్లి చేసుకుని ఐదారు సంవత్సరాలు కాపురం చేసి, ఎంతోకొంత డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏమైపోతుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై స్పందించారు. తనను పదేపదే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, మీరు కూడా చేసుకోండని పవన్ సూచించారు. మొదటి భార్యకు ఐదు కోట్లు ఇచ్చి విడాకులు తీసుకుని, రెండో పెళ్లి చేసుకొన్నానని అన్నారు. విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నాను తప్ప కొంతమంది నేతల లాగా ఒక్క పెళ్లి చేసుకుని, ముప్పై మంది స్టెఫినీలతో తిరగలేదని పవన్ మండిపడ్డారు.
ఈ వివాదంలోకి జనసేన నాయకులు వైఎస్ జగన్ సోదరి షర్మిలను లాగారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని పదేపదే మాట్లాడుతున్న జగన్ ఒకప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ భార్యకు బలవంతంగా విడాకులు ఇప్పించి తన చెల్లెలు షర్మిలతో పెళ్లి చేసిన విషయం గుర్తులేదా? అని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు హరిప్రసాద్, తిరుపతి ఇన్చార్జి కిరణ్ ప్రశ్నించారు. జనసేనాని మాట్లాడింది బూతులైతే వైసీపీ మంత్రులు మాట్లాడేది సుప్రభాతమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏపీలో రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే..! ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి ప్రజలలో తిరుగుతూ ఉన్నారు.
Next Story