Mon Dec 23 2024 05:34:54 GMT+0000 (Coordinated Universal Time)
శ్యామ్ బాబుపై సినిమా తీయడం మొదలుపెట్టిన జనసేన నాయకులు
అంబటి చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఫైర్ అవుతున్నారు. తిరుపతిలో జనసేన నేతలు.. అంబటి రాంబాబుపై
'బ్రో' సినిమా విషయమై వైసీపీ, జనసేనల మధ్య వాదనలు సాగుతూ ఉన్నాయి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తనను టార్గెట్ చేశారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ పై సినిమా చేస్తానని దీనికి తన వద్ద కొన్ని సినిమాల పేర్లు ఉన్నాయని ఆయన చెప్పారు. అంబటి చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఫైర్ అవుతున్నారు. తిరుపతిలో జనసేన నేతలు.. అంబటి రాంబాబుపై 'SSS' పేరుతో సినిమా ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. ఒక వ్యక్తికి అంబటి రాంబాబు మాస్క్ వేసి ఈ సీన్ ను తీశారు. సినిమా పేరు 'SSS' అని.. సందులో సంబరాల శాంబాబు అని అర్థమని చెప్పారు. ఈ సినిమాలో హీరోయిన్స్ ని ముంబై రెడ్ లైట్ ఏరియా నుంచి కానీ కోల్ కతా చాందినీ గంజ్ నుంచి కానీ తీసుకొస్తామని తెలిపారు. జగ్గూభాయ్ సమర్పణలో చిత్రాన్ని నిర్మిస్తామని చెప్పారు.
జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ మాట్లాడుతూ వైసీపీ నేతలు పవన్ ఫొటో చూసినా, పేరు విన్నా వణికిపోతున్నారని చెప్పారు. ఏపీ మంత్రులు తమ శాఖల గురించి మాట్లాడకుండా... కేవలం పవన్ గురించే మాట్లాడుతున్నారని అన్నారు. దమ్ముంటే ప్రత్యేక హోదా, పోలవరం, రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చకు రావాలని మహేశ్ సవాల్ విసిరారు. బ్లాక్ మనీని వైట్ చేయడంలో జగన్ దిట్ట అని చెప్పారు. జగన్ పై సినిమా తీయాలనే ఆలోచన వచ్చినప్పటికీ బడ్జెట్ లేదని, అందుకే ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశానని చెప్పారు. వెబ్ సిరీస్ కు కొన్ని పేర్లు ఆలోచించానని.. డాటర్ ఆఫ్ వివేకా, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అదే ఇల్లు, ఒక ఖైదీ వదిలిన బాణం, కోడికత్తి సమేత శ్రీను, గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసుక దిబ్బలు, తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093 పేర్లు ఆ జాబితాలో ఉన్నాయని తెలిపారు. వెబ్ సిరీస్ లో నటించేందుకు వైసీపీలో ఉన్న నటులు కూడా ట్రై చేసుకోవచ్చని చెప్పారు. తెల్ల జుట్టు ఉన్న వాళ్లకు కూడా అవకాశం ఇస్తామని తెలిపారు.
అంతకు ముందు ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ పై తాను కూడా సినిమా తీయనున్నట్లు మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. తాము తీయబోయే సినిమా కథకు సంబంధించిన లైన్ ను కూడా మంత్రి రాంబాబు వివరించారు. ఓ మంచి నేపథ్యం ఉన్న కుటుంబంలో అన్నదమ్ములు అందరూ ఓ రంగంలో మంచి పేరుప్రఖ్యాతులు సాధిస్తారు. అదే కుటుంబంలో పుట్టిన చిన్నవాడికి మాత్రం చదువు అబ్బదని, బలాదూర్ గా తిరుగుతుంటాడంటూ ఓ స్టోరీ లైన్ చెప్పుకొచ్చారు.
Next Story