Fri Dec 20 2024 01:42:11 GMT+0000 (Coordinated Universal Time)
జనసేన క్యాడర్ కు సూచనలివే
జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యర్థుల మైండ్ గేమ్ లో పడొద్దని సూచించింది
జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యర్థుల మైండ్ గేమ్ లో పడొద్దని సూచించింది. పొత్తులపై ప్రత్యర్థులు మైండ్ గేమ్ కు తెరతీసినట్లు కొన్ని సంఘటనలు చెబుతున్నాయని అధినాయకత్వం పేర్కొంది. జనసేన పార్టీకి ఆదరణ పెరగడానికో, క్యాడర్ లో అయోమయాన్ని సృష్టించడానికి కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది.
ట్వీట్ ద్వారా...
ఈ మేరకు నాగబాబు సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలకు పంపారు. పవన్ కల్యాణ్ కూడా ఇదే రకమైన ట్వీట్ చేశారు. ఎప్పుడూ పొడగని వారు కూడా పొగడ్తలకు దిగారని, వాటిని నమ్మవద్దని పవన్ పేర్కొనడం విశేషం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థులు మైండ్ గేమ్ మొదలు పెట్టారని వాటిలో పడవద్దని పవన్ కల్యాణ్ సూచించారు.
Next Story