Fri Dec 20 2024 06:47:04 GMT+0000 (Coordinated Universal Time)
దాడిపై స్పందించిన నాదెండ్ల
జనసైన కార్యకర్తలు మంత్రులపై జరిపిన దాడిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జనసైన కార్యకర్తలు మంత్రులపై జరిపిన దాడిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. దాడులను తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని అన్నారు. జనసేన కార్యకర్తలు దాడి చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.
దృష్టి మళ్లించేందుకే...
పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన దృష్టి మళ్లించేందుకు వైసీపీ మంత్రులు నాటకాలు ఆడుతున్నారన్నారు. జనసేన కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారని ఆయన అన్నారు. మంత్రులపై దాడి జరిగితే వారికి రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
Next Story