Fri Dec 20 2024 07:05:46 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల టార్చర్ ఏంటి?
పోలీసుల పట్ల తమకు గౌరవం ఉందని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు
పోలీసుల పట్ల తమకు గౌరవం ఉందని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోలీసులు తమను బెదిరించారన్నారు. పవన్ కల్యాణ్ ను వెహికల్ పైకి ఎక్కకూడదని ఆంక్షలు పెట్టారని అన్నారు. రాత్రి మూడు గంటలకు వచ్చి పవన్ కల్యాణ్ ప్రయాణించే వాహనం కీ తమకు అప్పగించాలని కోరారు. పవన్ కల్యాణ్ తో ముగ్గురు పోలీసు అధికారులతో చర్చించారని, ఎవరికీ కనపడకుండా జనవాణి కార్యక్రమానికి వెళ్లాలని సూచించారన్నారు.
జనవాణిని భగ్నం చేయడానికి...
జనవాణి కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి వైసీపీ నాయకులు నిన్నటి నుంచే ప్రయత్నిస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సామాన్యుల కోసం చేసే కార్యక్రమాన్ని అడ్డుకున్నారంటే ఇంతకంటే బాధాకరమని ఇంతకంటే లేదన్నారు. పోలీసు అధికారులు వేధింపులకు గురిచేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
Next Story