Mon Dec 23 2024 23:29:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జనసేన పీఏసీ కమిటీ సమావేశం
విజయవాడలో నేడు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు
విజయవాడలో నేడు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. జనసేన చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లడంపైనా చర్చించనున్నారు. కౌలు రైతు సదస్సులు, జనవాణితో పాటు ఇటీవల చేపట్టిన డిజిటిల్ క్యాంపెయిన్ పై వస్తున్న స్పందనపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలసింది. దీంతో పాటు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై గురించి కూడా నేతలు చర్చించనున్నారు.
పొత్తులపై కూడా...
దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కూడా ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ నేతలతో చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది. ఇక ఆయన ప్రారంభించబోయే యాత్రపైన కూడా చర్చ జరగనుంది. అక్టోబరులో పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఉండనుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా పవన్ కల్యాణ్ ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని జనసేన వర్గాలు వెల్లడించాయి.
Next Story