Mon Dec 23 2024 14:42:37 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : విశాఖ ఫిషింగ్ హార్బర్ కు పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాద స్థలిని పరిశీలిస్తున్నారు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. ఫిషింగ్ హార్బర్ కు బయలుదేరి అక్కడ అగ్ని ప్రమాద స్థలిని పరిశీలిస్తున్నారు. బాధిత కుటుంబాలతో పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. వారికి ఒక్కొక్కరికి జనసేన పార్టీ తరుపున యాభై వేల రూపాయల సాయాన్ని అందచేయనున్నారు. బోటు యజమానులకు అండగా నిలబడాలని స్వయంగా పవన్ కల్యాణ్ విశాఖకు వచ్చి ఈ సాయాన్ని అందిస్తున్నారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మత్స్యకారులకు సాయం...
ఇటీవల విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం సంభవించి దాదాపు ముప్ఫయి నుంచి నలభై బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం కూడా తన వంతు సాయంగా ఎనభై శాతాన్ని సాయంగా అందించింది. అయితే జనసేన పార్టీ తరుపున కూడా అందించేందుకు పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. తమకు వచ్చిన కష్టాన్ని పవన్ కల్యాణ్ అర్థం చేసుకుని ఆదుకునేందుకు వచ్చిన ఆయనకు మత్స్యాకారులు కన్నీటితో తమ గోడును చెప్పుకున్నారు.
Next Story