Wed Dec 18 2024 17:34:16 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ సభకు దూరంగా పవన్
భీమవరంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు
భీమవరంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. పవన్ గైర్హాజరీపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ వచ్చారు. అల్లూరి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. దాదాపు రెండు గంటల పాటు మోదీ భీమవరంలోనే ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి రావల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
వేదికపై చోటు లేకనే...
చిరంజీవిని ఆహ్వానించడంతో ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి మోదీ సభకు హాజరయ్యారు. వేదికపై చిరంజీవి ఆశీసునలయ్యారు. కేవలం పదకొండు మందికి మాత్రమే వేదికపై చోటు కల్పించారు. పవన్ కల్యాణ్ కు వేదికపై చోటు లేకపోవడంతో ఆయన వెళ్లలేదని తెలిసింది. మోదీ వచ్చిన సందర్భంగా పవన్ భీమవరానికి వెళతారని అందరూ భావించారు. ఎందుకంటే గత ఎన్నికలలో భీమవరం నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేశారు. అయినా మోదీ సభకు దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కానీ అది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి తాను వెళ్లడం లేదని పవన్ అన్నట్లు తెలుస్తోంది.
Next Story