Fri Dec 20 2024 01:49:44 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశాలు
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన - టీడీపీ ఆత్మీయ సమావేశాలు జరగనున్నాయి.
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన - టీడీపీ ఆత్మీయ సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఉమ్మడి కార్యక్రమాలపై చర్చించనున్నారు. నియోజకవర్గాల స్థాయిలో రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పోయి వచ్చే ఎన్నికల్లో పని చేయాలని భావిస్తూ నియోజకవర్గ స్థాయిలో ఈ ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల పాటు...
14, 15, 16 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆత్మీయ సమావేశాలను నిర్వహించుకోవాలని సమన్వయకమిటీ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17వ తేదీ నుంచి ఇంటింటి ప్రచారాన్ని ఇరు పార్టీల నేతలు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా ఇరు పార్టీల నేతలను ఐక్యంకగా కలిపి ఉంచేందుకు ఈ ఆత్మీయ సమావేశాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
Next Story