Mon Dec 23 2024 16:29:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జనసేన ఆవిర్భావ సభ.. పవన్ స్పీచ్పైనే
నేడు జనసేన ఆవిర్భావ సభ మచిలీపట్నంలో జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి
నేడు జనసేన ఆవిర్భావ సభ మచిలీపట్నంలో జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు లక్ష మంది కూర్చునేలా ఏర్టాట్లు చేశారు. జనసేన పదో ఆవిర్భావ సభను ఆర్భాటంగా నిర్వహించనున్నారు. రెండు రాష్ట్రాల నుంచి వచ్చే జనసైనికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అరవై ఎకరాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశారు. వీరమహిళలు ఇబ్బంది పడకుండా వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అరవై ఎకరాల్లో...
మచిలీపట్నం సమీపంలోని అరవై ఎకరాల్లో సభను నిర్వహించనున్నారు అయితే 30 యాక్ట్ అమలులో ఉందని రహదారిపై వెళ్లే వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది కలకుండా ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారిపై ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్యాహ్నం మంగళగిరి ప్రధాన కార్యాలయం నుంచి వారాహి వాహనంలో బయలుదేరి ర్యాలీగా మచిలీపట్నం వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరిని లక్ష్యంగా చేసుకుని ప్రసంగిస్తారన్న ఉత్కంఠ రాజకీయ పార్టీల్లో నెలకొంది.
Next Story