Mon Dec 23 2024 19:49:05 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మరో కొత్త పార్టీ... అందులో నుంచే జేడీ పోటీ
జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు తెలిపారు
జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త పార్టీల అవసరం ఏపీలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న రెండు పార్టీల పాలనను ప్రజలు చూశారని, అయితే ఎవరు వచ్చినా రాష్ట్రాభివృద్ధి ఆశించినంత మేర జరగడం లేదని ప్రజలు ఎక్కువ మంది ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
చర్చించిన అనంతరం...
దీనిపై మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అందరితో మాట్లాడిన తర్వాత కొత్త పార్టీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జేడీ లక్ష్మీనారాయణ గత లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున విశాఖ పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఏ పార్టీలో చేరతారన్న ఉత్కంఠకు ఆయన తెరదించారు. తాను కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీ తరుపునే విశాఖ పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం. మరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story