Thu Apr 10 2025 01:36:08 GMT+0000 (Coordinated Universal Time)
జిందాల్ పరిశ్రమ మూసివేత.. రీజన్ ఇదే
విజయనగరం జత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేశారు.

విజయనగరం జత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేశారు. ప్రధాన ముడిసరుకు క్రోమ్ కొరత వల్ల జిందాల్ పరిశ్రమ మూసివేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఉత్పత్తులకు మార్కెట్లో ధరలు లేకపోవడంతో మూసివేస్తున్నట్లు జిందాల్ యాజమాన్యం వెల్లడించింది. జిందాల్ పరిశ్రమ ఆర్థికంగా నష్టపోతున్నట్లు యాజమాన్యం తెలిపింది.
నష్టాల్లో ఉండటంతో...
నష్టాల్లో ఉన్న పరిశ్రమను నడపలేమని ఆ పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. కేవలం ముడిసరుకు కొరత మాత్రమే కారణం కాదని, ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడం కూడా పరిశ్రమ మూసివేతకు కారణమని చెబుతున్నారు. అయితే ఈ జిందాల్ పరిశమ్రలో పనిచేస్తున్న యాభై ఏడు మంది ఉద్యోగులకు జిందాల్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది.
Next Story