Mon Dec 23 2024 07:10:46 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు కూడా వైసీపీలో చేరికలు.. ఎవరెవరంటే?
వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. జగన్ బస్సు యాత్రలోనే చేరికలు ఎక్కువగా ఉన్నాయి
వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. జగన్ బస్సు యాత్రలోనే చేరికలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు కూడా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద కొందరు నేతలు వైసీపీలో చేరారు. టీడీపీ, బీజేపీ నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వారిని పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు.
చేరిన నేతలు వీరు..
ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైసీపీ లోకి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ చేరారు. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైసీపీ లోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డితో పాటు అదే నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి కూడా పార్టీలో చేరారు. బీజేపీ నుంచి మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్‌లు కూడా వైసీపీలో చేరారు.
Next Story