Wed Dec 25 2024 20:12:36 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ సర్కార్ పై నడ్డా ఫైర్
ప్రధాని మోదీ రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అన్నారు.
ప్రధాని మోదీ రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అన్నారు. రాజమండ్రిలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పంచాయతీ ఖాతాల్లో వేసిన నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని జేపీ నడ్డా ఆరోపించారు. శాంతిభద్రతలు కూడా రాష్ట్రంలో క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలు ఒక్కరూ ఏపీ వైపు చూడటం లేదన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని జేపీ నడ్డా స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాతృభాష అయిన తెలుగుకు కూడా అన్యాయం జరుగుతుందన్నారు.
కుటుంబ రాజకీయాలకు....
వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించాలా? అని ప్రజలు ఆలోచిస్తున్నారని జేపీ నడ్డా అన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు. రాష్ట్రం విద్యుత్తు కోతలతో ప్రజలు అల్లాడి పోతున్నారని జెడ్డా అన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జేపీ నడ్డా కోరారు. కుటంబ రాజకీయాలకు స్వస్తి చెబుదామని జేపీ నడ్డా పిలుపునిచ్చారు.
Next Story