Sat Jan 11 2025 06:09:10 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu Bail : నాట్ బి ఫోర్ మి అన్న న్యాయమూర్తి
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను తాను విచారించలేనని నాట్ బిఫోర్ మి అని న్యాయమూర్తి జ్యోతిర్మయి అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను తాను విచారించలేనని నాట్ బిఫోర్ మి అని న్యాయమూర్తి జ్యోతిర్మయి అన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ తో పాటు మధ్యంతర బెయిల్ పిటీషన్లను దాకలు చేశారు. దీనిపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ బెంచ్ ముందుకు విచారణ వచ్చింది.
చీఫ్ జస్టిస్ కు రిఫర్...
అయితే ఈ బెయిల్ పై విచారణ నాట్ బి ఫోర్ మి అని జ్యోతిర్మయి చెప్పారు. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి జ్యోతిర్మయి. చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ బెయిల్పై విచారణకు నాట్ బి ఫోర్ మి అనడంతో తిరిగి చీఫ్ జస్టిస్ ఈ కేసును విచారిస్తారా? లేదా వేరే బెంచ్ కు బదిలీ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. విచారణను ఈ నెల ౩౦వ తేదీకి వాయిదా వేసింది.
Next Story