Sat Dec 21 2024 14:34:43 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : క్వాష్ పిటీషన్ కొట్టివేత
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై తీర్పు వెలువడింది.
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై తీర్పు వెలువడింది. చంద్రబాబుకు ప్రతికూలంగా తీర్పు చెప్పింది. సీఐడీ తరుపున వాదనను సమర్థించింది. చంద్రబాబు క్వాష్ పిటీషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇది చంద్రబాబుకు ఎదురుదెబ్బ. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో తనపై నమోదయిన కేసులన్నీ కొట్టి వేయాలని చంద్రబాబు వేసిన పిటీషన్ పై వాడి వేడి వాదనలు జరిగాయి. చంద్రబాబుకు తెలిసే కుంభకోణం జరిగిందని సీఐడీ తరుపున న్యాయవాదులు తెలిపారు. అయితే 17ఎ ప్రకారం చంద్రబాబును గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారంటూ ఆయన తరుపున న్యాయవాదులు వాదించారు.
తిరస్కరణ...
చంద్రబాబు తరుపున హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూధ్రా వాదించగా, సీఐడీ తరుపున ముకుల్ రోహిత్గీ వాదించారు. ఇరువురి వాదనలు సుదీర్ఘంగా దాదాపు ఏడు గంటలకు పైగానే సాగాయి. తీర్పు రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి క్రితం హైకోర్టు ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు ఈ తీర్పుతో ఊరట లభించలేదు క్వాష్ పిటీషన్ పై ఆయనకు ప్రతికూలంగా తీర్పు చెప్పడంతో ఆయనపై నమోదయిన కేసులతో పాటు కస్టడీ పిటీషన్ పై కూడా ఏసీబీ కోర్టు ఆలోచించే అవకాశముంది.
Next Story