Sat Apr 05 2025 08:45:57 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు తీర్పు... మళ్లీ టెన్షన్
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పై అదనపు షరతులపై నేడు తీర్పు రానుంది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పై అదనపు షరతులపై నేడు తీర్పు రానుంది. హైకోర్టు ఈ తీర్పు వెలువరించనుంది. చంద్రబాబుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను అనారోగ్య కారణాలతో హైకోర్టు ఇటీవల మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీఐడీ కొన్ని షరతులను విధించాలని న్యాయస్థానాన్ని కోరింది.
బెయిల్ షరతులపై...
దీనిపై సీఐడీ వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును నేడు ఇవ్వనుంది. రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, ర్యాలీలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడకూడదని, ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను చంద్రబాబు వద్ద నియమించాలని సీఐడీ న్యాయస్థానం కోరింది. అయితే ఇందుకు చంద్రబాబు తరుపున న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story