Mon Nov 25 2024 04:12:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తీర్పు.. అంతా టెన్షన్
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడనుంది
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. ఏసీబీ న్యాయస్థానం ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు తీర్పు చెప్పనుంది. నిన్ననే తీర్పు వెలువరించాల్సి ఉన్నప్పటికీ న్యాయమూర్తి ఈరోజు ఉదయానికి వాయిదా వేశారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కస్టడీకి అప్పగిస్తే రాజమండ్రి సెంట్రల్ జైలులోనే సీఐడీ అధికారులు విచారించే అవకాశముంది.
ఇరు వర్గాల వాదనలు...
సీఐడీ అధికారులు తమకు కస్టడీకి అప్పగిస్తే చంద్రబాబు వద్ద నుంచి మరిన్ని విషయాలు రాబట్టాలని భావిస్తుంది. సీఐడీ తరుపున న్యాయవాదులు న్యాయస్థానంలో ఇదే చెప్పారు. ఈ కేసును మరింత లోతుగా విచారించాలంటే కస్టడీకి ఐదు రోజులు అప్పగించాలని కోరారు. అయితే 24 గంటల పాటు సీఐడీ విచారించిందని, చంద్రబాబు పట్ల రాజకీయ కక్షతోనే ఈ కేసు బనాయించిందని, కస్టడీకి ఇవ్వవద్దంటూ చంద్రబాబు తరుపున న్యాయవాదులు కోరారు. దాదాపు ఐదు గంటల పాటు ఇరువర్గాలు తమ వాదనలను వినిపించాయి. దీనిపై మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది.
Next Story