Thu Dec 19 2024 12:21:01 GMT+0000 (Coordinated Universal Time)
పిన్నెల్లీ..నువ్వు దాడులు చేయించింది నిజం కాదా?
వైసీపీ వాళ్ళ దాడి లో బలైన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ బీసీ లేనని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు
వైసీపీ వాళ్ళ దాడి లో బలైన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ బీసీ లేనని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేసినా పోలీసులు స్పందించలేదన్నారు ఈసీ, జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామన్న బ్రహ్మారెడ్డి ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉందన్నారు. ఎన్నికల తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి పదేపదే హెచ్చరించారని, పిన్నెల్లి వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోలేదని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక పిన్నెల్లిని పోలీసులు గృహనిర్బంధం చేశారన్నారు. పోలీసుల గృహనిర్బంధం నుంచి తప్పించుకుని హైదరాబాద్ ఎలా వెళ్లారని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్ కు వెళ్లి...
హైదరాబాద్లో మీడియాతో మాట్లాడినా పిన్నెల్లిపై చర్యలు లేవని, పిన్నెల్లిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై మాచర్లలో దాడులు చేశారని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను పిన్నెల్లి కబ్జా చేశారని, మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మూకలు దాడులు చేశాయని, వైసీపీ దాడుల్లో 74 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు గాయపడ్డారన్నారు. దాడిచేసి.. పోలీసు అధికారులకు కులం అంటగట్టి మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు. అధికారుల జాబితా పంపింది, నియమించింది మీ ప్రభుత్వమే కదా? అని నిలదీశారు. తన ఇంటి వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను పెట్టి గృహనిర్బంధం చేశారని, చట్టాన్ని గౌరవించి తాను ఇంట్లోనే ఉండిపోయానని చెప్పారు.
Next Story