Mon Dec 23 2024 02:55:38 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్
గుంటూరు మెడికల్ కళాశాలలో సీనియర్లు జూనియర్ విద్యార్థులను వేధించడంతో వారు మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు.
గంటూరు : గుంటూరు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. సీనియర్లు జూనియర్ విద్యార్థులను వేధించడంతో వారు మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. గుంటూరు మెడికల్ కళాశాలలోని వసతి గృహంలో సీనియర్లు ఈ ర్యాగింగ్ కు పాల్పడినట్లు చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన విద్యార్థుల వివరాలను మెడికల్ కౌన్సిల్ గోప్యంగా ఉంచి ప్రిన్సిపాల్ వివరణ కోరిందని తెలసింది.
పొడుగు చొక్కాలు....
వసతి గృహంలో తమను పొడుగు చొక్కాలు ధరించి రావాలంటూ సీనియర్లు ర్యాగింగ్ చేశారని కౌన్సిల్ కు వారు ఫిర్యాదు చేశారు. దీనిని చిన్న వివాదంగా కళాశాల యాజమన్యం భావించింది. దీంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ర్యాగింగ్ పై విచారణ జరపాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించింది. అయితే ప్రిన్సిపాల్ ఇప్పటికే సీనియర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వివాదాన్ని సర్దుబాటు చేసినట్లు తెలిసింది.
Next Story