Thu Apr 24 2025 20:42:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్గా నేడు జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్గా నేడు జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరికాసేపట్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నూతన గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు వివిధ పార్టీల నేతలు హాజరు కానున్నారు.
మూడో గవర్నర్ గా...
ఆంధ్రప్రదేశ్ కు మూడో గవర్నర్ గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయయూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే నూతన గవర్నర్ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు కలసి ఆయనను రాష్ట్రానికి స్వాగతించారు. నేడు నూతన గవర్నర్ గా అబ్దుల్ నజీర్ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.
Next Story