Wed Dec 18 2024 21:01:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మేడిగడ్డకు జస్టిస్ పినాకీ చంద్రఘోష్
జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు
జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంపై ఏర్పాటయిన జ్యుడిషియల్ కమిషన్ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు.
కుంగిపోయిన ప్రాజెక్టును...
ఈ సందర్భంగా జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం రామగుండంలోని గెస్ట్ హౌస్ లో రాత్రికి బస చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ కు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
Next Story