Sun Dec 22 2024 22:22:53 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కు.. ఏపీ అప్పులకు లింక్ పెట్టిన కేఏ పాల్
కేంద్ర ప్రభుత్వం తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని కేఏ పాల్ ఆరోపించారు. ఛారిటీ డబ్బు ఒక్క రూపాయి కూడా..
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. కేఏ పాల్ అమరావతిలో మాట్లాడుతూ.. ప్రజాశాంతి పార్టీ గుంటూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేశామని, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఆన్లైన్లో ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ప్రతి గ్రామానికి సర్పంచ్ ద్వారా కోటి రూపాయలు ఇస్తానని ఈ సందర్భంగా చెప్పారు. ఐదు సంవత్సరాలలో రాజధాని ఎందుకు కట్టలేదని చంద్రబాబును కేఏ పాల్ ప్రశ్నించారు. చంద్రబాబు 5 లక్షల కోట్లు, జగన్ నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసారు. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేస్తే రాష్ట్రంలో అప్పులు తీరుతాయా అని అడిగారు.
కేంద్ర ప్రభుత్వం తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని కేఏ పాల్ ఆరోపించారు. ఛారిటీ డబ్బు ఒక్క రూపాయి కూడా పార్టీకి వాడటం లేదన్నారు పాల్. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్టీల్ ప్లాంట్లో పని చేస్తున్న 44 వేలమంది ఉద్యోగులు రోడ్డున పడతారు. నన్ను స్టీల్ ప్లాంట్లో కి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. నాకు పర్మిషన్ ఇస్తే నాకున్న ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్కు కడతానని అన్నారు. జేడీ లక్ష్మీనారాయణను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని.. సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు. గ్రామస్థాయిలో కమిటీలు వేస్తున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై లక్షల మంది కమిటీ సభ్యులు ఉన్నారన్నారు.
Next Story