Sat Nov 16 2024 18:30:45 GMT+0000 (Coordinated Universal Time)
కాదంబరి జెత్వాని వేధింపుల కేసు.. సీనియర్ ఐపీఎస్ అధికారుల సస్పెండ్
ముంబై నటి కాదంబరీ జెత్వానికి వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారంలో
ముంబై నటి కాదంబరీ జెత్వానికి వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు విధించింది. కాదంబరి జెత్వానికి సంబంధించిన కేసులో వారి ప్రమేయంతో సహా పలు ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్‌తో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులు వెస్ట్ మాజీ ఏసీపీ కె హనుమంత రావు, ఇబ్రహీంపట్నం మాజీ ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణను డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
జెత్వాని మరియు ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేసే సమయంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారని అంతర్గత విచారణలో తేలింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఏసీపీ కే స్రవంతి రాయ్ నటిపై నమోదైన అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని తన నివేదికలో ధృవీకరించారు. పలు ఆరోపణలపై విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story