Tue Apr 15 2025 20:51:43 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసు బెయిల్ పిటీషన్ తిరస్కరణ
వైఎస్ వివేకా హత్య కేసులో ఉమా శంకర్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను కడప కోర్టు తిరస్కరించింది.

వైఎస్ వివేకా హత్య కేసులో ఉమా శంకర్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను కడప కోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసులో మూడో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి. హత్య కేసు విచారణ ఉన్న సమయంలో ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరుపున న్యాయవాదులు వాదించారు.
సాక్షులను ప్రభావితం చేస్తారని....
సీబీఐ న్యాయవాదుల వాదనతో కడప కోర్టు ఏకీభవించింది. ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. కాగా వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది.
Next Story