Wed Dec 25 2024 06:44:02 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐకి షాక్ ఇచ్చిన కడప అధికారులు
సీబీఐ అధికారులకు కడప జిల్లా ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ఖాళీ చేయాలని ఆదేశించారు.
సీబీఐ అధికారులకు కడప జిల్లా ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ఖాళీ చేయాలని ఆదేశించారు. గత ఏడాదికి పైగానే సీబీఐ అధికారులు కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఉదయం నుంచి సాయంత్రం విచారణ చేసి, రాత్రికి ఈ గెస్ట్ హౌస్ లోనే బస చేస్తారు. సీబీఐ అధికారులు అద్దెకు తీసుకుని ఇక్కడ ఉంటున్నారు.
జగన్ వస్తుండటంతో....
అయితే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ఖాళీ చేయాలని సీబీఐ అధికారులను కడప జిల్లా అధికారులు ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లాకు వస్తున్నారు. ఒంటిమిట్ట రామాలయంలో జరిగే కల్యాణంలో పాల్గొననున్నారు. సీఎం వస్తుండటంతో ఆయన బస చేయడానికి వీలుగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. అందుకోసమే సీబీఐ అధికారులను ఖాళీ చేయాలని ఆదేశించారు. రాములోరి కల్యాణం తర్వాత తిరిగి గదులు కేటాయిస్తామని సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలిసింది.
Next Story