Sun Dec 22 2024 14:08:51 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ అవినాష్ రెడ్డి బెయిల్ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసినట్లయింది.
భాస్కర్ రెడ్డికి బెయిల్...
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అవినాష్ కుటంుబానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించినట్లయింది.
Next Story