Mon Dec 23 2024 10:28:55 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి హైకోర్టుకు అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. గతంలో తాను వేసిన పిటిషన్లో మధ్యంతర దరఖాస్తు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 14న సీబీఐ జరిపిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డ్‌ను ఇవ్వాలని న్యాయస్థానాన్ని అవినాష్ రెడ్డి కోరారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
నాలుగు సార్లు...
ఇప్పటి వరకు సీబీఐ నాలుగు సార్లు అవినాష్ రెడ్డిని విచారించింది. వివేకా హత్య కేసులో విచారణకు హాజరుకాకుండా మినహాయింపు కోసం గతంలో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అవినాశ్‌రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న ఆయన అభ్యర్థననూ తోసిపుచ్చింది. అయితే తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అవినాష్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించి వీడియో, ఆడియో రికార్డులను కోరారు. ఒక వర్గం మీడియా తన విచారణను వక్రీకరిస్తుందని అవినాష్‌రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పిటీషన్ వేసినట్లు తెలిసింది.
Next Story