Mon Dec 23 2024 05:54:16 GMT+0000 (Coordinated Universal Time)
తల్లి డిశ్చార్జ్ .. హైదరాబాద్ కు అవినాశ్
మే19వ తేదీన అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. పులివెందుల ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం..
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి నేడు విశ్వభారతి హాస్పిటల్ నుండి నేడు డిశ్చార్జ్ కానున్నారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఆమెను హైదరాబాద్ కు తరలించే అవకాశాలు లేకపోలేదు. తల్లి ఆరోగ్యం మెరుగుపడటంతో వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ కు బయల్దేరారు.
మే19వ తేదీన అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. పులివెందుల ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం.. ఆమెను కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే సీబీఐ విచారణకు హాజరు కావలసి ఉన్న అవినాశ్.. తల్లి అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు ఈనెల 22న సీబీఐకు లేఖ రాశారు. తనకు మరో 10 రోజుల సమయం కావాలని లేఖలో కోరగా.. సీబీఐ దానిపై స్పందించకుండానే నేరుగా విశ్వభారతి హాస్పిటల్ కు వెళ్లారు. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమన్న వార్తలు గుప్పుమన్నాయి. అదే రోజున ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాశ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ సుప్రీంను కోరింది. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది.
Next Story