Mon Dec 23 2024 20:22:00 GMT+0000 (Coordinated Universal Time)
మూడు గంటలుగా సీబీఐ ఆఫీసులోనే
వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు దాదాపు మూడు గంటలుగా విచారిస్తున్నారు
వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు దాదాపు మూడు గంటలుగా విచారిస్తున్నారు. సీీబీఐ అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ఎస్పీ రాంసింగ్ బృందం అవినాష్ రెడ్డిని విచారిస్తుంది. నలుగురు అధికారుల బృందంలో ఒక మహిళ అధికారి కూడా ఉన్నారు. అవినాష్ రెడ్డి కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలపైనే ఎక్కువగా విచారిస్తున్నట్లు సమాచారం.
భారీగా పోలీసులు...
అయితే కోఠిలోని సీబీఐ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. అవినాష్ రెడ్డి అనుచరులు కూడా అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, పారదర్శకంగా విచారణ చేయాలని అవినాష్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. దీంతో కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story