Sat Dec 21 2024 12:39:06 GMT+0000 (Coordinated Universal Time)
Kadapa : రౌడీషీటర్లకు నగర బహిష్కరణ.. ఏడో తేదీ వరకూ
రౌడీషీటర్ల జిల్లా బహిష్కరణకు అధికారులు కడప పోలీసులు రంగం సిద్ధం చేశారు
రౌడీషీటర్ల జిల్లా బహిష్కరణకు అధికారులు కడప పోలీసులు రంగం సిద్ధం చేశారు. కడప జిల్లాలో 21 మంది రౌడీషీటర్లను జిల్లా బహిష్కరణ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం నుంచి జూన్ ఏడో తేదీ వరకు జిల్లాలో ఉండకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా...
కడప జిల్లా వ్యాప్తంగా 1033 మందిపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఇప్పటికే రౌడీషీటర్లందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం నుంచి జిల్లా వదలాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో ఆరుగురు రౌడీషీటర్లు జిల్లా బహిష్కరణ చేస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీచేశారు. తిరిగి ఏడో తేదీ తర్వాతే నగరంలో అడుగుపెట్టాలనికోరారు.
Next Story