Mon Dec 23 2024 00:39:24 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడలో కూల్చివేతలు ప్రారంభం
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు చెందిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు
కాకినాడలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారుల కూల్చివేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు చెందిన నిర్మాణాలను కాకినాడ నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇవన్నీ అక్రమ నిర్మాణాలుగా గుర్తించామని అధికారులు చెబుతున్నారు. కాకినాడలోని సంత చెరువు సెంటర్ లో దుకాణాలను ద్వారంపూడి అనుచరులు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నిర్మించారు.
ద్వారంపూడి అనుచరులను...
అయితే దీనిని కూల్చివేయడానికి వచ్చిన మున్సిపల్ సిబ్బందిని ద్వారంపూడి అనుచరులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. భారీ బందోబస్తును ఏర్పాటుచేసి అక్రమ నిర్మాణాలను కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు.
Next Story