Mon Dec 16 2024 11:12:16 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడ పోర్టుకు మరోసారి రేషన్ బియ్యం?
కాకినాడ పోర్టులో మళ్లీ రేషన్ బియ్యం ఎగుమతికి సిద్ధం అయింది. అయితే జాయింట్ కలెక్టర్ పరిశీలనతో రేషన్ బియ్యం కంటైనర్లు తనిఖీలు చేశారు.
కాకినాడ పోర్టులో మళ్లీ రేషన్ బియ్యం ఎగుమతికి సిద్ధం అయింది. అయితే జాయింట్ కలెక్టర్ పరిశీలనతో రేషన్ బియ్యం కంటైనర్లు తనిఖీలు చేశారు. మరోసారి కాకినా పోర్టు వద్దకు రేషన్ బియ్యం కంటైనర్లు వచ్చాయన్న సమాచారంతో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర అధికారులు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర అధికారులు పరిశీలించారు.
142 కంటైనర్లలో...
మొత్తం దాదాపు 142 కంటైనర్లలో ఎగుమతికి రేషన్ బియ్యం సిద్ధంగా ఉంచారు. కాకినాడ పోర్టులోని కంటైనర్ల యాడ్ కి వెళ్లి పరిశీలించారు. బియ్యం నమూనాలను సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్ కి పంపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కంటైనర్లలో ఉన్నది రేషన్ బియ్యమా? కాదా? అన్నది త్వరలోనే తెలుస్తుందని అధికారులు చెబుతన్నారు.
Next Story