Fri Nov 22 2024 23:44:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ డ్రైవర్‌కు 47 బంగారు పతకాలు.. జాతీయ, విదేశీ స్థాయిలో..
ఓ ఆర్టీసీ డ్రైవర్ ఒకవైపు ఉద్యోగంతో పాటు మరోవైపు తనకిష్టమైన బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్‌లో 47 పతకాలు సాధించి అందరి..
ఓ ఆర్టీసీ డ్రైవర్ ఒకవైపు ఉద్యోగంతో పాటు మరోవైపు తనకిష్టమైన బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్‌లో 47 పతకాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఉద్యోగం చేస్తున్నా ఏదో సాధించాలనే తపనతో తన పట్టుదల ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా చేసింది. ఆ ఆర్టీసీ డ్రైవర్ కాకినాడకు చెందిన మందపల్లి శ్రీనివాస్. పేదరికంలో పుట్టిన శ్రీనివాస్.. 10వ తరగతి వరకు చదివి లారీ డ్రైవర్‌గా చేశారు. అనంతరం ఆర్టీసీలో డ్రైవర్‌గా ఉద్యోగం సంపాదించాడు.
అయితే ఒలిపింక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాడు శ్రీనివాస్. ఫిట్నెస్ కోసం ఈ వయసులో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకంటున్నాడు. జగన్నాథపురానికి చెందిన శ్రీనివాసరావు తండ్రి చిన్నతనంలో చనిపోయారు. శ్రీనివాస్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ ఆర్టీసీ ఎండీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నాడు. 2004 నుంచి ముదునూరి అక్కిరాజు వద్ద బాడీ బిల్డింగ్ లో శిక్షణ పొందారు. అక్కిరాజు ప్రోత్సాహంతో అదే ఏడాది విశాఖలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరై రెండో స్థానంలో నిలవడంతో శ్రీనివాసరావుపై అందరి దృష్టి పడింది. 2004లో మొదలైన ఆయన బాడీ బాల్డింగ్.. ఇప్పటి వరకు బాడీబిల్డింగ్, వెయింట్ లిఫ్టింగ్‌లో 47 పతకాలను సాధించాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు పతకాలు సాధిం చారు. అప్పటి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలను సొంతం చేసుకున్నాడు శ్రీనివాస్.
ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 430 కేజీల విభాగంలో జాతీయ స్థాయిలో మూడు బంగారు పత కాలు సాధించడంతో ఇప్పటి వరకు 47 పతకాలను సాధించాడు. ఇప్పటి వరకు పవర్ లిఫ్టింగ్ లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించాడు. ఇక ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే సామర్థ్యాలను మరింత మెరుగు పరచుకునే క్రమంలో షాట్‌పుట్, హేమర్, డిస్క స్ వంటి క్రీడల్లోనూ సాధన చేస్తున్నానని శ్రీనివాస్ చెబుతున్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెబుతున్నాడు.
పవర్ లిఫ్టింగ్ లో బంగారు పతకాలు
ఛత్తీస్‌గఢ్ భిలాయ్ నగరంలో నిర్వహించిన 29వ జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో శ్రీనివాసరావు మొదటి స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలు సాధించారు. 100 కిలోల బెంచ్ ప్రెస్ విభాగంలో 95 కేజీలు, డెడ్ లిఫ్ట్ విభాగంలో 180 కేజీల బరువు ఎత్తి రెండు విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. అలాగే దుబాయ్ లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా బంగారు పతకం సాధించి ప్రశంసలు పొందుతున్నాడు.
Next Story