Mon Dec 23 2024 01:31:40 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : పంతం.. ఏందిది? పవన్ కల్యాణ్ ఆగ్రహం
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పై జరిపిన దాడి వివాదం కొనసాగుతుంది.
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వివాదం కొనసాగుతుంది. ఆయన రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పై జరిపిన దాడిపై చర్యలకు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకు దిగారు. ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఎస్పి ని కలిసి వైద్యులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కళాశాల గ్రౌండ్స్ లో ఇబ్బందులను ప్రస్తావించడానికి వచ్చిన పంతం నానాజీ ప్రిన్సిపల్ పై దాడికి దిగారు.
చేయిచేసుకోవడంపై...
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు ను దుర్భాషలాడటమే కాకుండా, ఆయనపై దాడి చేశారన్న ఆరోపణలతో దుమారం రేగింది. చేయిచేసుకోవడంతో వైద్యులు అడ్డుకున్నారు. అయినా పంతం నానాజీ వినలేదు. అయితే తర్వాత విషయం తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పంతం నానాజీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంతం నానాజీ కూడా క్షమాపణ చెప్పారు. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా దీనిపై స్పందించారు. దోషులను వదిలేది లేదని చెప్పారు. అయినా వైద్యులు మాత్రం పంతం నానాజీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story