Mon Apr 21 2025 12:03:17 GMT+0000 (Coordinated Universal Time)
ఇప్పుడు డబ్బులు వేయడానికి అనుమతి అడుగుతారా?
పథకాల పేరుతో ఇప్పుడు డబ్బులు వేయడానికి అనుమతి అడుగుతారా అని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.

పథకాల పేరుతో ఇప్పుడు డబ్బులు వేయడానికి అనుమతి అడుగుతారా అని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. ఎప్పుడో నొక్కిన బటన్కు ఇప్పుడు డబ్బులు వచ్చేదేంది అంటు ఆయన నిలదీశారు. ఎన్నికల ముందు ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనాలనే ఉద్దేశ్యం తప్ప వైసీపీ ప్రభుత్వానికి వేరే ఆలోచన లేదననారు.
డబ్బులే లేకుండా...
అసలు డబ్బులే లేకుండా ఎన్నికల కమిషన్ కు లెటర్ రాశావా అంటూ టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. ఎలాగూ ఒప్పుకోదు కాబట్టి ఈసీ పై నెపం వేసేందుకే ఈ ప్రయత్నాలను వైసీపీ ప్రభుత్వం మొదలు పెట్టిందని కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఈసీ, విపక్షాలపై తప్పు చూపెట్టి ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నమే ఇందులో కనపడుతుందన్నారు.
Next Story