Mon Dec 23 2024 04:40:45 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు : కన్నా
తనతో కొందరు బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని, వారు కూడా త్వరలోనే టీడీపీలో చేరతారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
తనతో కొందరు బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని, వారు కూడా త్వరలోనే టీడీపీలో చేరతారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈరోజు టీడీపీలో చేరే ముందు కన్నా ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎవరు టచ్ లో ఉన్నారన్న విషయం మాత్రం కన్నా లక్ష్మీనారాయణ చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని ఆయన చెబుతుండటంతో ఎవరు కన్నాతో టచ్ లో ఉన్నారన్న దానిపై చర్చ జరుగుతుంది.
ఫ్లెక్సీల తొలగింపుతో...
ఇప్పటికే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు గుంటూరు వచ్చి మరీ కన్నా లక్ష్మీనారాయణను కలసి వెళ్లారు. ఆయన పార్టీ నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేశారు. విష్ణుకుమార్ రాజు చేరిక దాదాపు ఖాయమయిపోయిందంటున్నారు. ఇక మిగిలిన వారు ఎవరన్న దానిపై త్వరలోనే తేలనుంది. మరోవైపు ఈరోజు చేరిక సందర్భంగా గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీనిపై కన్నా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story