Thu Dec 19 2024 10:02:59 GMT+0000 (Coordinated Universal Time)
Kanuma : నేడు కనుమ ఇక కాస్కో నా రాజా
సంక్రాంతి పండగ పర్వదినాల్లో మూడో రోజైన కనుమను నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు
సంక్రాంతి పండగ పర్వదినాల్లో మూడో రోజైన కనుమను నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. దీనిని పశువుల పండగగా కూడా భావిస్తారు. తమకు పాడితో పాటు పంటలు చేతికందడానికి ఉపయోగపడే పశువులను నేడు పూజిస్తారు. అందుకే దీనికి కనుమ పండగగా అని అంటారు. తొలి రెండు రోజుల పాటు భోగి, సంక్రాంతి పండగ రోజు చేసుకున్న ప్రజలు నేడు కనుమ పండగ చేసుకుంటారు. ఈరోజు మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తుంది.
నేడు కోడిపందేల జోరు...
ఇక ఈరోజు కోడిపందేల జోరు కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుమ రోజు ఎక్కడకు బయలుదేర కూడదని చెబుతారు. అందుకే ఈ రోజు తమ సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు ఈరోజు తిరుగు ప్రయాణం చేయరు. అందుకే ఈరోజు పల్లెల్లోనే ఉండి మూడో రోజు కనుమ పండగను జరుపుకుంటారు. కనుమ పండగ కోసం అనేక మంది ఎదురు చూస్తుంటారు. ప్రధానంగా మాంసాహార ప్రియులు ఎక్కువ మంది ఈరోజు కోసం ఏడాదంతా కళ్లు కాయలు కాచేలా చూస్తారు. పశువుల పండగ రోజు తమ ఇంట్లో ఉన్న పశుపక్ష్యాదులను అందంగా అలంకరించి వాటికి పూజలు చేస్తారు.
Next Story