Mon Dec 23 2024 10:22:57 GMT+0000 (Coordinated Universal Time)
జోగయ్య మరోసారి హాట్ కామెంట్స్
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ఐదేళ్లు సీఎంగా ఉంటారని అన్నారు. బీజేపీతో కలిస్తే మోదీ చరిష్మా తోడయి అదనపు బలం చేకూరుతుందని అన్నారు. టీడీపీ జనసేనతో కలిస్తే ఇక వైసీపీ ఓటమి ఖాయమని హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ ను సీఎం చేస్తేనే వైసీపీని ఓడించగలరని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని జోగయ్య డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి అయితేనే...
హరిరామ జోగయ్య గత కొంతకాలంగా పవన్ సీఎం కావాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే పొత్తు కుదుర్చుకోవాలని హరిరామ జోగయ్య అనేక సార్లు అన్నారు. అలా కాకుండా కేవలం మంత్రి పదవులతో సరిపెట్టుకుంటూ పొత్తు కుదుర్చుకుంటే ప్రయోజనం ఉండదని కూడా సూచించారు. చంద్రబాబు ఈ విషయంపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే పొత్తుకు దిగాలని హరిరామ జోగయ్య సూచిస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ మాత్రం తాను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనంటూ, ఆత్మగౌరవానికి దెబ్బకలగకుండా పొత్తుల నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.
Next Story