Mon Dec 15 2025 06:26:55 GMT+0000 (Coordinated Universal Time)
కాపు రిజర్వేషన్లపై మ్యానిఫేస్టోలో చోటేదీ.. మరో లేఖ విడుదల చేసిన జోగయ్య
కాపు సంక్షేమ నేత హరిరామ జోగయ్య కూటమి పార్టీ నేతలకు ఘాటు లేఖ రాశారు

కాపు సంక్షేమ నేత హరిరామ జోగయ్య కూటమి పార్టీ నేతలకు ఘాటు లేఖ రాశారు. నిన్న టీడీపీ, జనసేన విడుదల చేసిన మ్యానిఫేస్టోలో కాపు రిజర్వేషన్ల ప్రస్తావన లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వెనకబడిన కాపు కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మ్యానిఫేస్టోలో పెట్టకుండా ఆ సామాజికవర్గాన్ని మోసం చేయాలని భావిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
కాపు సామాజికవర్గాన్ని...
కాపులు ఆర్థికంగా వెనక బడి ఉన్నారని, అటువంటి వారికి రిజర్వేషన్లు కల్పించే విషయంపై మ్యానిఫేస్టోలో ఎందుకు చోటు కల్పించలేక పోయారని ఆయన ప్రశ్నించారు. కాపు సామాజికవర్గం ఓటర్లు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించకపోవడానికి కారణాలు చెప్పాలంటూ ఆయన హరిరామ జోగయ్య రాసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story

