Fri Dec 20 2024 11:54:22 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల లడ్డూ నెయ్యికి "నందిని" పకడ్బందీ విధానం
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో తయారయ్యే నందిని నెయ్యిని పకడ్బందీగా తిరుమలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో తయారయ్యే నందిని నెయ్యిని పకడ్బందీగా తిరుమలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి కల్తీ దారి మధ్యలో జరగకుండా ముందు జాగ్రత్త చర్యలను కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. తిరుమల లడ్డూ వివాదం తలెత్తడంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.
జీపీఎస్ విధానంతో...
తిరుమలకు పంపే నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల మార్గమధ్యంలో ఎవరూ ట్యాంకర్ను తెరవలేరని, టీటీడీ అధికారులు ఓటీపీతోనే ఎంటర్ చేస్తేనే తెరుచుకుంటుందని అన్నారు. నెల రోజుల క్రితమే టీటీడీకి నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తెలిపింది.
Next Story