Sun Dec 22 2024 16:35:17 GMT+0000 (Coordinated Universal Time)
Karthika Deepotsavam: నవంబర్ 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 18వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం పరిపాలన మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో నవంబరు 15న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడునిపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
Next Story