Mon Dec 30 2024 16:28:27 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Chinni : నువ్వు అన్నవేనా.. నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే?
అక్రమ ఆస్తులు, కేసులు పై కేశినేని నాని కి ఆయన సోదరుడు కేశినేని చిన్ని సవాల్ విసిరారు
అక్రమ ఆస్తులు, కేసులు పై కేశినేని నాని కి ఆయన సోదరుడు కేశినేని చిన్ని సవాల్ విసిరారు. దమ్ముంటే తన పై చేసిన ఆరోపణలు నిరూపించమన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయట పెడతా కేశినేని శివనాథ్ వార్నింగ్ ఇచ్చారు. తాము భవిష్యత్తు లో ఏం చేయబోతున్నాం, గతంలో ఏం చేశామో చెబుతున్నామని, కేశినేని నాని మాత్రం తమపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కలల రాజధాని అమరావతిని వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. ప్రజల ఆర్ధిక వనరులు దెబ్బ తీసి పొట్ట కొట్టారన్నారు. కేశినేని నాని పదేళ్లల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పలేరా అని ప్రశ్నించారు.
నిందలు వేస్తావా?
విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏం చేశావో చెప్పు నా కారు నంబర్, నా స్టిక్కర్ వాడాడు అంటారు నా పై అనేక కేసులు ఉన్నాయంటున్న నాని కి దమ్ముంటే అవన్నీ నిరూపించమని సవాల్ విసిరారు. తన మీద నిందలు వేస్తూ... ప్రజా సమస్యలు గా చిత్రీకరిస్తావా? అంటూ నిలదీశారు. అసలు ప్రజలకు ఏం చేశావో ఎందుకు చెప్పడం లేదన్నారు. పదేళ్లు ఎంపీగా ఎన్ని అభివృద్ధి పనులు చేశావో చెప్పాలన్నారు. ఫ్లైఓవర్ ల నిర్మాణం నీ వల్ల జరిగిందాఅంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా నువ్వు ఒక్కడివే ఫ్లైఓవర్ కట్టావా అని కేశినేని చిన్ని ప్రశ్నించారు. ఆనాడు సిఎంగా చంద్రబాబు స్థలాలు ఇచ్చి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని,ఎంపిగా ఢిల్లి వెళ్లి వస్తే... అన్నీ నువ్వే చేసినట్లా అని అన్నారు.
చెల్లిపై కేసులు పెట్టి...
చెల్లి ఏదో మాట అన్నదని.. ఆమె పై రెండు కేసులు పెట్టాడన్నారు. ఇటీవల ఒక హోటల్ కూడా నాని ప్రారంభించాడని, 34 కోట్లు అప్పు తీసుకుని ఈ హోటల్ పెట్టాడన్నారు. రాము, హేమంత్ పేరు తో హోటల్ ట్రాన్సఫర్ చేశారన్నారు. ఆర్.ఒ.సి ఇంటిమేషన్ లేదు.. అంటే కుట్ర కోణమే కదా అప్పులు ఎగ్గొట్టేలా, మళ్లీ లీజు కు కూడా ఇచ్చాడంటూ చిన్ని ఫైర్ అయ్యారు.ఇటువంటి అవినీతి, అక్రమాలు చాలా ఉన్నాయని, వీళ్లా తన పై ఆరోపణలు చేసేది... నేను నిరూపిస్తా.. దమ్ము ఉంటే వాళ్లు నిరూపించాలి అంటూ చిన్ని సవాల్ విసిరారు.
Next Story