Mon Dec 23 2024 08:12:44 GMT+0000 (Coordinated Universal Time)
సునీల్ దియోధర్ ఇంట్లో కేశినేని నాని
ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దియోథర్ ఇంటికి కేశినేని నాని వెళ్లారు. వినాయక చవితి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు
పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఈ మధ్య కాలంలో ఏం చేసినా సంచలనం కలిగించేవే. పార్టీ లైన్ కు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు సభ్యుడిగా కేశినేని నాని పార్టీ అధినాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన బహిరంగంగానే తన అసంతృప్తిని బయట పెడుతుంటారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చంద్రబాబుకు చెప్పారన్న ప్రచారం కూడా జరిగింది. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు విమానాశ్రయంలో ఆయన బొకేను ఇచ్చేందుకు నిరాకరించడం కూడా వివాదంగా మారింది.
వినాయకుడి పూజల కోసం...
తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దియోథర్ ఇంటికి కేశినేని నాని వెళ్లారు. వినాయక చవితి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వినాయకుడి పూజల్లో పాల్గొనడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా కేశినేని నాని బీజేపీకి చేరువవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నట్లు ఆయన ఢిల్లీలో సునీల్ దియోధర్ నివాసానికి వెళ్లడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
Next Story