Thu Dec 19 2024 15:01:47 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ఎప్పుడో చెప్పిన మంత్రి.. అప్పటి నుంచేనట
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో ఈరోజు మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. '
అధ్యయనం తర్వాతనే...
తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యంలో ఎదురయ్యే లోటు పాట్లు ఆంధ్రప్రదేశ్ లో తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు. అందుకోసం రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అనంతరం ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలు చేస్తామన్నది చెప్పారు. తీసుకునే నిర్ణయం ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, మహిళలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆయన తెలిపారు. సచివాలయంలో ఆయన ప్రకాశం జిల్లా దర్శిలో 18.51 కోట్ల రూపాయల అంచనాలతో డ్రైవింగ్ శిక్షణ, రీసెర్చ్ సంస్థ ఏర్పాటు ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు.
Next Story