Wed Apr 23 2025 21:39:15 GMT+0000 (Coordinated Universal Time)
Brekaikng : ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో, కార్యాయాల్లో సిట్ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం పది మంది సభ్యులతో కూడిన బృందం హైదరాబాద్ లోని కసిరెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సోదాలను నిర్వహిస్తుంది.
సిట్ అధికారుల సోదాలు...
లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. ఈ పేరును వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టడంతో ఈ మద్యం స్కాంలో కసిరెడ్డిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని భావించి సిట్ ఈ సోదాలను నిర్వహిస్తుంది. పది నుంచి పదిహేను బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
Next Story