Mon Dec 23 2024 07:31:29 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కీలక పరిణామం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో ఈరోజు మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసినపిటీషన్ పై విచారణ జరిగింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం మరో బెంచ్ కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
మరో బెంచ్ కు మారుస్తూ...
సీజేఐ ధర్మానసంలో జస్టిస్ సంజయ్ కుమార్ సభ్యుడు గా ఉన్నారు. ఆయన విచారణ ప్రారంభం అయినవెంటనే నాట్ బిఫోర్ మి అని తప్పుకున్నారు. దీంతో సీజేఐ ధర్మాసనం ఈ కేసుల విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. కేసు విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేశారు.
Next Story