Mon Dec 23 2024 04:08:45 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాగుంట రాఘవను అరెస్ట్ చేశారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ అరెస్ట్ ప్రకంపనలు రేపుతుంది. మాగుంట రాఘవను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనవాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ పేరు తొలి నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వినిపిస్తూనే ఉంది.
గతంలోనే సోదాలు...
ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఇంతకుముందు సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు చేశారు. నెల్లూరు, చెన్నైలలో జరిపిన తనిఖీల్లో అనేక కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే అప్పట్లో ఈ ఆరోపణలను మాగుంట శ్రీనివాసరెడ్డి ఖండించారు. కానీ ఈరోజు మాగుంట కుమారుడు అరెస్ట్ కావడంతో కొంత సంచలనంగానే మారింది. మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Next Story