Sun Dec 22 2024 22:06:47 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీకి మరో షాక్.. కీలక నేత రాజీనామా
వైసీపీకి కీలక నేత రాజీనామా చేశారు. వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు.
వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఆమె జగ్గయ్యపేట టిక్కెట్ ను ఆశిస్తున్నారు. కానీ వైఎస్ జగన్ ఆమెకు గత ఎన్నికల్లోనూ టిక్కెట్ ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు.
జగ్గయ్యపేట టిక్కెట్ ను...
అక్కడ వైసీపీ నేతగా ఉన్న ఉదయభాను జనసేనలో చేరడంతో తనను ఇన్ఛార్జిగా నియమిస్తారని వాసిరెడ్డి పద్మ భావించారు. కానీ మరొక వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించడంతో వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పద్మ తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపినట్లు తెలిసింది.
Next Story