Sat Nov 23 2024 10:33:58 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఎన్ని నిమిషాలు కుటుంబ సభ్యులతో మాట్లాడొచ్చంటే?
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలవనున్నారు. ఈరోజు ముగ్గురు కుటుంబ సభ్యులను మాత్రమే అధికారులు అనుమతించారు. చంద్రబాబు నాయుడిని నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలవనున్నారు. ముగ్గురికి మాత్రమే అనుమతి రావడంతో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త భరత్ బయటే ఉండిపోయారు. ములాఖత్ లో చంద్రబాబును 45 నిమిషాల పాటు కలిసేందుకు అనుమతించారు. సెంట్రల్ జైలుకు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. సెంట్రల్ జైలు వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు కోసం జైలు అధికారులు స్నేహ బ్లాక్ ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. చంద్రబాబుకు ఇంటి భోజనంతోపాటు మందులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. భద్రతా కారణాల వల్ల మిగతా ఖైదీలతో కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఏ1గా చేర్చారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Next Story